భారీ ఊరట: తమిళనాడు ఆలయాల్లోకి మొబైల్ ఫోన్ల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్

రిపోర్టర్: విజయ్ స్థలం: తమిళనాడు

తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లే నిబంధనను సడలిస్తూ హిందూ మత, ధార్మిక దానాల శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో విధించిన పూర్తి నిషేధాన్ని ఎత్తివేస్తూ భక్తులకు భారీ ఊరటనిచ్చారు. అయితే ఆలయాల పవిత్రతను కాపాడేందుకు ఫొటోగ్రఫీ ఆంక్షలను మాత్రం కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.