బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: India

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు గడువును సెప్టెంబర్ 17 వరకు పొడిగించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఈ ఖాళీల భర్తీకి అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రాడ్యుయేషన్‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులు. ప్రారంభ వేతనం రూ.48,480 నుంచి ఉంటుంది.