దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కీవే హైప్‌వోల్ట్ ఆర్ విడుదల
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా గుర్తింపు పొందిన కీవే హైప్‌వోల్ట్ ఆర్ వాహనానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన రివ్యూను యూట్యూబ్ వేదికగా విడుదల చేశామని ప్రముఖ మోటార్‌సైకిల్స్ అండ్ బైక్ రివ్యూయర్ దినేష్ కుమార్ (Dino's Vault - హైదరాబాద్) వెల్లడించారు. ఈ సరికొత్త ఈవీ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 180 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్‌ను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వాహనం పనితీరు, వేగం మరియు ఇతర ప్రత్యేకతల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తన అధికారిక యూట్యూబ్ ఛానెల్లో అందుబాటులో ఉన్న వీడియోను వీక్షించాలని తెలిపారు.