ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు పరిహారం గ్రీన్‌ఛానల్‌లో: సీఎం

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

ఎస్సీ, ఎస్టీలపై నమోదవుతున్న అట్రాసిటీ కేసులు, వారి సంక్షేమంపైహైదరాబాద్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన హైపవర్‌ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అట్రాసిటీ బాధితులకు అందించే పరిహారాన్ని ఇకపై గ్రీన్‌ఛానల్‌ ద్వారా వేగంగా అందించనున్నట్లు సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం, కమిషన్‌ అండగా ఉంటాయని పేర్కొన్నారు. సమావేశంలో కేసుల పురోగతి, బాధితుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్‌, రాంబాబు నాయక్‌, శంకర్‌, నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.