రామన్నపేటలో మహిళల అక్షరాస్యత కోసం అమ్మ అక్షరం కార్యక్రమం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రామన్నపేట

రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాలనగరం పాఠశాలలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో అమ్మ అక్షరం కార్యక్రమం నిర్వహించారు. సర్పంచుల ఫోరం కార్యదర్శి గర్ధాస్ విక్రమ్ పాల్గొని మాట్లాడారు. మహిళలు విద్యతోనే ఆత్మవిశ్వాసం సాధించి అన్ని రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. కుటుంబ, సామాజిక అభివృద్ధిలో విద్య కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.