విశాఖ ఆర్కే బీచ్లో సీఎం చంద్రబాబు పర్యటన మరియు పింఛన్ మంజూరు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం ఆర్కే బీచ్లో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని మానవీయతను చాటుకున్నారు. సాగర తీరంలో మురిమిక్చర్ విక్రయిస్తున్న ఒంటరి మహిళతో మాట్లాడి ఆమెకు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. సముద్ర వ్యర్థాల సేకరణ, ప్లాస్టిక్ తొలగింపు కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మత్స్యకారులు, స్కూబా డైవర్లతో ముఖాముఖి మాట్లాడారు.