వైద్య విద్యార్థులకు తీపి కబురు: తెలుగు రాష్ట్రాల్ లో భారీగా పెరిగిన పీజీ సీట్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
వైద్య విద్య పీజీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న ఎంబీబీఎస్ వైద్యులకు జాతీయ వైద్య కమిషన్ శుభవార్త అందించినట్లు విశ్లేషకుడు డాక్టర్ టి. కృష్ణారెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా తొమ్మిది వేలకు పైగా పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఆరు వందల తొంభై ఆరు, ఏపీలో నాలుగు వందల ఎనిమిది సీట్లు అదనంగా పెరిగాయని పేర్కొన్నారు. ఈ పెంపుతో స్థానిక విద్యార్థులకు క్లినికల్ విభాగాల్ లో సీట్లు దక్కేందుకు మెరుగైన అవకాశాలు ఏర్పడ్డాయని స్పష్టం చేశారు.