నిర్లక్ష్యంలో 140 ఏళ్ల నాటి చారిత్రక తిలక్ గ్రంథాలయం

రిపోర్టర్: హరి స్థలం: ఉత్తర్‌ప్రదేశ్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఉన్న 140 ఏళ్ల పురాతన తిలక్ గ్రంథాలయం తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటోంది. సరైన నిధులు, సిబ్బంది కొరత కారణంగా సుమారు 50,000 అరుదైన పుస్తకాలు శిథిలమయ్యే ప్రమాదంలో పడ్డాయి. మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద లాంటి దిగ్గజాలతో అనుబంధం ఉన్న ఈ చారిత్రక లైబ్రరీని ఆదుకోవాలని చరిత్రకారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.