మాల్టా తీరంలో అరుదైన ఈగల్ రే చేపల భారీ గుంపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: మాల్టా

మాల్టా ఉత్తర తీరంలో ట్యూనా చేపల ఫారం వద్ద వందలాది ఈగల్ రే చేపలు గుమికూడటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. సముద్ర గర్భంలో జరిగిన పరిశోధనలో 100 నుంచి 150 వరకు ఈ చేపలు ఒకచోట చేరినట్లు గుర్తించారు. ట్యూనా చేపలకు వేసే ఆహారం మిగిలిపోవడం వల్లే ఇవి ఇక్కడకు చేరినట్లు పరిశోధకులు తేల్చారు. మధ్యధరా సముద్రంలో అంతరించిపోతున్న ఈ జాతి చేపల ప్రవర్తనపై ఈ పరిణామం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.