మలేషియాలో ఉద్యోగాల కోసం ఉచిత వీసా వాడుకోవద్దని భారతీయులకు హెచ్చరిక
రిపోర్టర్: భాస్కర్
స్థలం: మలేషియా
మలేషియా కల్పిస్తున్న ముప్పై రోజుల ఉచిత వీసా సౌకర్యాన్ని దేశంలో ఉద్యోగాల కోసం ఉపయోగించుకోవద్దని అక్కడి భారత హైకమిషన్ పౌరులను హెచ్చరించింది. ఈ వీసా కేవలం పర్యటనకు మాత్రమేనని, ఉద్యోగాల కోసం వెతకడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. మోసపూరిత ఏజెంట్ల వలలో పడి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండి అరెస్టులు, నిర్బంధాలను ఎదుర్కోవద్దని కౌలాలంపుర్లోని భారత హైకమిషన్ స్పష్టం చేసింది.