అమెరికా మధ్యంతర ఎన్నికలు: డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్న భారతీయ అమెరికన్ ఓటర్లు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Washington
అమెరికాలో రాబోయే మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో భారతీయ అమెరికన్ ఓటర్లు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపుతున్నారని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చింతన్ పటేల్ తెలిపారు. రిపబ్లికన్ల విధానాలు మరియు పెరుగుతున్న వివక్ష ఆందోళనల కారణంగానే గతంలో ట్రంప్‌కు మద్దతిచ్చిన వారిలో కొందరు ఇప్పుడు తమ నిర్ణయం మార్చుకుంటున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.