కూతురు విషయంలో భర్త అతిగా ప్రవర్తిస్తారంటూ నటి రిచా చద్దా కామెంట్స్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Mumbai
కూతురు జునీ రొటీన్ విషయాలపై భర్త అలీ ఫజల్ అతిగా ఆందోళన చెందుతుంటారని, ఆయన ప్రవర్తన తనకు ఎంతో చిరాకు తెప్పిస్తుందని ప్రముఖ బాలీవుడ్ నటి రిచా చద్దా పేర్కొన్నారు. దూరంగా ఉన్నప్పటికీ కూతురు ఏం తింటోంది, ఎలా ఉందంటూ ప్రతి చిన్న విషయంపై ఆరా తీయడం తనను విసిగిస్తుందని ఆమె చెప్పారు. అయితే పెడన నాన్నల కాలంలో ఇలాంటి జాగ్రత్తలు ఉండేవి కాదని, ఆయన ప్రేమను తాను స్వాగతిస్తున్నానని ఆమె తెలిపారు.