హైడ్రా ప్రజావాణికి క్యూ కట్టిన ఆక్రమణలు మరియు అక్రమ నిర్మాణాల ఫిర్యాదులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

హైడ్రా ప్రజావాణికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, దారి సమస్యలపై భారీగా ఫిర్యాదులు అందాయి. కోకాపేట, కేపీహెచ్‌బీ, మెహిదీపట్నం అలాగే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పశుమాముల గ్రామానికి చెందిన బాధితులు తమ సమస్యలను అధికారుల ముందుంచగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.