మాదకద్రవ్యాల నివారణకు అధికారులు కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపు

రిపోర్టర్: సతీష్ స్థలం: నాగర్ కర్నూల్

మాదకద్రవ్యాల లేని సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎస్పీ నాగర్ కర్నూల్ (SP Nagarkurnool) స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్ మరియు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఈ మేరకు కీలక దిశానిర్దేశం చేశారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు, మాదకద్రవ్యాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను ఆదేశించారు.