స్థానిక ఎన్నికల్లో కూటమి బీటలు వారుతుందన్న విపక్ష ఆశలు ఆవిరి: పీవీఎన్ మాధవ్

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక కూటమి పార్టీలు విడిపోతాయని విపక్షం ఆశగా ఎదురుచూసిందని, కానీ విస్తృత సమన్వయంతో అందరూ ఏకతాటిపై నిలబడ్డారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్లతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చాతుర్యం, ఉపముఖ్యమంత్రి చొరవతోనే క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు సాధ్యమైందని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రభుత్వం జోడెద్దుల బండిలా పరుగులు పెట్టిస్తోందని ఆయన వివరించారు.