హైదరాబాద్ గోపన్‌పల్లిలో ప్రమాదకరంగా ఒరిగిన నాలుగంతస్తుల భవనం
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధి గోపన్‌పల్లిలో 50 గజాల స్థలంలో నిర్మించిన నాలుగంతస్తుల భవనం ప్రమాదకరంగా ఒకవైపునకు ఒరిగింది. ఏ క్షణంలోనైనా కూలిపోతుందనే భయంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే అప్రమత్తమై భవనాన్ని పరిశీలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి, భవనం చుట్టూ ఉన్న ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.