'షహజాద్ భట్టి నెట్‌వర్క్ ఉగ్రవాద సంస్థే': కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

పాకిస్థాన్ ఆధారిత గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టికి చెందిన 'షహజాద్ భట్టి నెట్‌వర్క్'ను కేంద్ర హోంశాఖ ఉపా చట్టం కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. లాహోర్‌కు చెందిన షహజాద్ భట్టి దుబాయ్ కేంద్రంగా ఐఎస్ఐ ప్రోక్సీగా వ్యవహరిస్తూ భారత్‌లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. సిద్దు మూసేవాలా హత్యతో పాటు పలు హింసాత్మక ఘటనలతో సంబంధం ఉన్న ఈ నెట్‌వర్క్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.