లక్ష మంది ఉద్యోగులను తొలగించనున్న ఫోక్స్‌వ్యాగన్!

రిపోర్టర్: గోపి స్థలం: World

జర్మనీకి చెందిన ప్రపంచ దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా లక్ష మంది ఉద్యోగులను తొలగించేందుకు మేనేజ్‌మెంట్ మరియు కార్మిక ప్రతినిధులు అంగీకరించారు. చైనా ఆటోమొబైల్ కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో మందగించిన డిమాండ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఓ ఒలివర్ బ్లూమ్ తెలిపారు.