రిషబ్ పంత్ ఆటతీరుపై మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వైట్ బాల్ క్రికెట్ లో తన సహజమైన దూకుడును మార్చుకోవాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశారు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లుగా మరింత తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో పంత్ స్థానం కోల్పోవడంపై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.