ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం: బూట్ల తయారీ పరిశ్రమలో నలుగురు దుర్మరణం
రిపోర్టర్: మహేష్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని మంగోల్పురి పారిశ్రామిక వాడలో ఉన్న ఒక బూట్ల తయారీ పరిశ్రమలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ఘోర దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సుమారు ఇరవై ఫైర్ ఇంజిన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారని, క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.