కెనడాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం నలుగురు దుర్మరణం
రిపోర్టర్: శివ
స్థలం: Montreal
కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక ప్రావిన్షియల్ పోలీసులు వెల్లడించారు. మాంట్రియల్ నగరానికి ఆగ్నేయంగా యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ఈ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయి పూర్తిగా అంటుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మృతుల వివరాలను ఇంకా గుర్తించలేదని, ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.