హూతీలపై అమెరికా సైనిక దాడుల తీవ్రతపై ఉత్కంఠ

రిపోర్టర్: సతీష్ స్థలం: అమెరికా

యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియా రాజధాని రియాద్పై బాలిస్టిక్ క్షిపణితో దాడికి ప్రయత్నించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో హూతీలపై యెమెన్లో సైనిక దాడులు చేపట్టే అవకాశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నడుమ ట్రంప్ తన క్యాంప్ డేవిడ్ పర్యటనను కుదించుకుని వైట్‌హౌస్‌కు తిరిగి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.