స్టీఫెన్ కర్రీ ఫౌండేషన్ సేవా కార్యక్రమం: ఓక్లాండ్ విద్యార్థులకు భారీ ఊరట
రిపోర్టర్: వెంకట్
స్థలం: Oakland
ప్రముఖ ఎన్బీఏ స్టార్ ఆటగాడు స్టీఫెన్ కర్రీ, ఆయన సతీమణి అయేషా కర్రీకి చెందిన ఈట్ లెర్న్ అండ్ ప్లే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓక్లాండ్ లోని సెకోయా ఎలిమెంటరీ పాఠశాలలో సరికొత్త క్రీడా ప్రాంగణాలు, పచ్చని వాతావరణాన్ని అభివృద్ధి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గత దశాబ్ద కాలంగా వెనుకబడిన ప్రాంతాల పిల్లల విద్య, పౌష్టికాహారం, ఆటల అభివృద్ధి కోసం తమ ఫౌండేషన్ ద్వారా నిరంతరం శ్రమిస్తున్నట్లు వారు వెల్లడించారు.