శంషాబాద్ విమానాశ్రయంలో చాక్లెట్ల రూపంలో భారీ కొకైన్ పట్టివేత
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు నిర్వహించిన తనిఖీలలో భారీ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయిందిని అధికారులు తెలిపారు. దోహా నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి లగేజీలో చాక్లెట్ల రూపంలో గుప్తంగా దాచి తరలిస్తున్న సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అంతర్జాతీయ ముఠాల ఆచూకీ కోసం దర్యాప్తును మరింత వేగవంతం చేశామని డీఆర్ఐ అధికారులు స్పష్టం చేశారు.