మారువేషంలో తహసీల్దార్ కార్యాలయంపై జనసేన ఎమ్మెల్యే ఆకస్మిక దాడి

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఏలూరు

ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వినూత్న రీతిలో తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచె, టీషర్టు, క్యాప్ ధరించి సామాన్యుడిలా ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లిన ఆయన, అధికారుల పనితీరును స్వయంగా పరిశీలించారు. రిటైర్డ్ టీచర్ సమస్యను పరిష్కరించాలని ఆదేశిస్తూ, ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.