కోజికోడ్‌లో రోడ్డు ప్రమాలంలో కాలికట్ ఎఫ్‌సీ ఫుట్‌బాల్ ఆటగాడు రిజాన్ జోస్ మృతి

రిపోర్టర్: రాము స్థలం: Kerala

కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కాలికట్ ఎఫ్‌సీ ఫుట్‌బాల్ ఆటగాడు రిజాన్ జోస్ (29) మృతి చెందారు. మరో ఆటగాడు ఘని అహ్మద్ నిగమ్‌తో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా గాంధీ రోడ్ ఫ్లైఓవర్ వద్ద వారి వాహనం మరో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిజాన్ కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో ఆటగాడు నిగమ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.