భువనేశ్వర్ కుమార్ పునరాగమనంపై ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: New Delhi
భారత జట్టులోకి సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను తిరిగి తీసుకోవడం సెలక్టర్ల పెద్ద పొరపాటని మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డారు. న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో భువనేశ్వర్ విఫలమవడంపై ఆయన యూట్యూబ్ వేదికగా స్పందించారు. భువనేశ్వర్ ను ఆడించడం వల్ల యువ ఆటగాళ్లకు దక్కాల్సిన అంతర్జాతీయ అనుభవం కోల్పోవాల్సి వచ్చిందని, భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు ఉండాలని పఠాన్ హితవు పలికారు.