సర్దార్ 2 పార్ట్ 1ని మించి భారీ విజయం సాధిస్తుంది: సామ్ సీఎస్
రిపోర్టర్: సతీష్
స్థలం: India
కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం కంటే ఈ చిత్రం మరింత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటుందని సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ధీమా వ్యక్తం చేశారు. సామాజిక అంశంతో కూడిన ఈ యాక్షన్ థ్రిల్లర్, మొదటి భాగం కంటే పెద్ద హిట్ అవుతుందని ఆయన పేర్కొనడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.