సరిహద్దు ఉగ్రవాదంపై పాక్ ప్రకటనలను ప్రపంచం నమ్మదన్న భారత్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: న్యూఢిల్లీ

సరిహద్దు ఉగ్రవాదంపై పాకిస్థాన్ విశ్వసనీయమైన చర్యలు తీసుకునే వరకు ఆ దేశం చేసే ప్రకటనలను ప్రపంచం నమ్మదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాక్ మాటలతో చెబితే సరిపోదని, ఆచరణాత్మకంగా చర్యలు ఉండాలని తేల్చిచెప్పారు. అఫ్గానిస్థాన్పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.