రూ.వెయ్యి నోట్ల చలామణిపై క్లారిటీ: తప్పుడు ప్రచారం నమ్మవద్దని పీఐబీ హెచ్చరిక

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో కొత్తగా వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ చలామణిలోకి రాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని అధికారులు తెలిపారు. వైరల్ అవుతున్న నకిలీ ఫోటోలు, నిరాధారమైన పోస్టులను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరించింది.