కేవీబీపురం మండలంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించిన కురపాటి శంకర్రెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కేవీబీపురం

తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కురపాటి శంకర్రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ ఆయన సేవలను కొనియాడారు. సమాజంలో సమానత్వం, విద్య కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.