బిహార్ రోడ్డు ప్రమాద బాధితులకు తప్పని ఎదురుచూపులు: నాలుగు నెలలైనా దక్కని పరిహారం
రిపోర్టర్: అశోక్
స్థలం: సంగం
బిహార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం నాలుగు నెలలైనా అందలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. సంగం, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన నలుగురు మృతి చెందగా, పదహారు మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా పరిహారం రాకపోవడంతో వైద్యానికి డబ్బులు లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.