'రేవంత్ అండ చూసుకుని అతి చేస్తే వదిలిపెట్టం': అధికారులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Telangana

తెలంగాణలో మరో రెండేళ్లలో కచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకుని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అతి చేసే ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులకు ఆయన ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.