'తిరుమల ఒక పవిత్ర దివ్యక్షేత్రంగా మారాలి': సీఎం చంద్రబాబు
రిపోర్టర్: రాము
స్థలం: తిరుపతి
రాజకీయాలకు అతీతంగా తిరుమల ఒక పవిత్ర దివ్యక్షేత్రంగా, భక్తుల పాలిట హీలింగ్ సెంటర్‌గా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా తిరుమలలో పద్మావతి అతిథిగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆరు సూత్రాల బృహత్తర ప్రణాళికను ప్రకటించారు. కొండపై కొత్త కాంక్రీట్ నిర్మాణాలకు అనుమతిలేదని, కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.