సోషల్ మీడియా పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్
రిపోర్టర్: మహేష్
స్థలం: Hyderabad
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ కోరారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో ఆయనను కలిసి ఫిర్యాదు అందజేశారు. కేటీఆర్ డైరెక్షన్లోనే బీఆర్ఎస్ శ్రేణులు సీఎంపై నిరాధార ఆరోపణలు చేస్తూ విష ప్రచారం చేస్తున్నాయని బల్మూర్ వెంకట్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తప్పుడు కంటెంట్ సృష్టించి వైరల్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.