చిరు వ్యాపారులకు పీఎం స్వనిధి ద్వారా క్రెడిట్ కార్డులు
రిపోర్టర్: గోపి
స్థలం: ఆంధ్రప్రదేశ్
దేశంలోని చిరు వ్యాపారుల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులకు ప్రత్యేకంగా క్రెడిట్ కార్డులు జారీ చేయనున్నారు. వ్యాపార పెట్టుబడుల నిమిత్తం కనిష్ఠంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.30 వేల వరకు వీటి ద్వారా వినియోగించుకోవచ్చు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా రక్షించేందుకు ఈ వెసులుబాటు కల్పించారు. నగరాలు, పట్టణాల్లోని లక్షలాది మంది వీధి వ్యాపారులకు ఇది ఊరటనివ్వనుంది.