వినాయక మండపాల ఏర్పాటులో ప్రభుత్వ మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించాలి
రిపోర్టర్: Pydi. Suryanarayana
స్థలం: ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి ఆధ్వర్యంలో వినాయక మండపాల కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల ఏర్పాటులో మున్సిపల్ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు విధిగా పాటించాలని ఆయన సూచించారు. ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, వాతావరణ కాలుష్యం తలెత్తకుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.