పురుషోత్తపురం సాగరం గండి పూడ్చి పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: టెక్కలి

తుఫాను ప్రభావంతో టెక్కలి మండలం పురుషోత్తపురం సాగరం గండి కొట్టడంతో సుమారు 200 ఎకరాలు నీట మునిగాయి. ఈ ముంపు ప్రాంతాలను మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రైతులతో కలిసి పరిశీలించారు. గండిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.