ఆమనగల్ మున్సిపాలిటీలో రెండు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. శ్రీకాంత్ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని, పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.