డీఎస్సీపై జగన్ వ్యాఖ్యలకు ఉద్యోగులే సమాధానం చెబుతారు
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వని వారు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మండిపడ్డారు. మెగా డీఎస్సీతో పాటు మరో మూడు డీఎస్సీలను నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకే జగన్ తదితరులు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కష్టపడి పారదర్శకంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులే వారికి తగిన సమాధానం చెబుతారని ఆయన స్పష్టం చేశారు.