హైదరాబాద్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ సమీపంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టడంలో, ప్రత్యేక తెలంగాణ సాధనలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని మంత్రి కొనియాడారు. విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, మన్మోహన్ సింగ్ దార్శనిక విధానాలు నేటి యువతకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు.