టికెట్ అడిగిన టీటీఈపై మహిళా ప్రయాణికురాలు దురుసు ప్రవర్తన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: India

రైలులో టికెట్ అడిగిన ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ తో రాధిక తివారీ అనే మహిళ వాగ్వాదానికి దిగి తన బట్టలు తానే చింపుకుని అసభ్యంగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టికెట్ లేకపోవడంతో టీటీఈని బెదిరిస్తూ అతనే తనపై అనుచితంగా ప్రవర్తించాడని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ ఘటనపై రైల్వే సేవా స్పందించి పూర్తి వివరాలు కోరగా, నెట్టింట ఈ ఉదంతంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.