మహిళా సీఈఓలపై వివాదాస్పద వ్యాఖ్యలు: మెకిన్సే గ్లోబల్ ఇన్ స్టిట్యూట్ నుంచి క్రిస్ బ్రాడ్లీ తొలగింపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
మహిళా సీఈఓల నియామకంపై సామాజిక మాధ్యమాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ లీడర్షిప్ పాత్ర నుంచి క్రిస్ బ్రాడ్లీని సంస్థ తొలగించినట్లు ప్రతినిధి టేలర్ బర్న్స్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సంస్థ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అయితే క్రిస్ బ్రాడ్లీ సీనియర్ పార్టనర్‌గా తన సేవలను కొనసాగిస్తారని సంస్థ పేర్కొన్నది. ఈ నిర్ణయం వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.