బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కు అద్దంకి పోలీసుల నోటీసులు జారీ

రిపోర్టర్: గోపి స్థలం: బాపట్ల

యూకేలో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన కేసులో బిగ్‌బాస్ కంటెస్టెంట్ రమానందనకు అద్దంకి పోలీసులు నోటీసులు అందజేశారు. కన్సల్టెన్సీ ద్వారా రూ.10.60 లక్షలు వసూలు చేసి మోసం చేశారంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమె తన న్యాయవాదితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నోటీసులు అందుకున్నారు.