ఆదిలాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం: 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
రిపోర్టర్: సతీష్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టి వంతెన వద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో జాతీయ రహదారి-44పై భారీ ట్రాఫిక్ స్తంభించింది. 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికే వంతెన మరమ్మతుల వల్ల వన్-వే ట్రాఫిక్ ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అధికారులు క్రేన్లతో వాహనాలను తొలగిస్తున్నా, రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి.