అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు 'హైకూ' ప్రేమకథా చిత్రం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 23న విడుదల కానుంది. ప్రేమలోని సున్నితమైన భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ పొయెటిక్ ఫీల్‌తో ఈ సినిమా సాగనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.