పీజీ జనరల్ సర్జరీలో బంగారు పతకం సాధించిన బొబ్బిలి యువతి సాయిమాధురి

రిపోర్టర్: వెంకట్ స్థలం: విజయనగరం

బొబ్బిలి పట్టణానికి చెందిన సింగంశెట్టి సాయిమాధురి దిల్లీలోని వర్ధమాన్‌ మహవీర్‌ వైద్య కళాశాలలో పీజీ జనరల్‌ సర్జరీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. ఎంబీబీఎస్‌ను విశాఖ ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో పూర్తి చేసిన ఆమె, తొలి ప్రయత్నంలోనే నీట్‌లో జాతీయ స్థాయిలో 284వ ర్యాంకు సాధించారు. భవిష్యత్తులో సర్జికల్‌ ఆంకాలజిస్టుగా సూపర్‌ స్పెషాలిటీ పూర్తి చేసి క్యాన్సర్‌ మహమ్మారిపై పోరాటం చేస్తానని, గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తానని ఆమె తెలిపారు.