బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసరాలు అందజేసిన ఈగ దామోదర్

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్దన్నపేట పదవ వార్డుకు చెందిన గాయల బాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈగ దామోదర్ పరామర్శించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి బియ్యం, వంట సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా గాయల బాబు మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఈగ దామోదర్ తెలిపారు.