ఖైరతాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి బరిలో ఉంటారంటూ కవిత సవాల్

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, ప్రచార ఆర్భాటం తప్ప చేతల్లో చేసిందేమీ లేదని ఆమె విమర్శించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని, ప్రజల గొంతుకగా నిలిచేందుకు తమ అభ్యర్థిని బరిలోకి దించుతామని స్పష్టం చేశారు.