అనంతపురంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే గనులపై మైనింగ్ శాఖ దాడులు

రిపోర్టర్: విజయ్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి చెందిన గనుల్లో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ సాగుతుందన్న ఫిర్యాదులతో అధికారులు గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. సాంకేతిక బృందాలతో మ్యాపింగ్, సర్వే నిర్వహించిన మైనింగ్ శాఖ అధికారులు అక్రమ తవ్వకాలను గుర్తించి భారీగా హెవీ యంత్రాలు, జేసీబీలు, పొక్లైన్లు, రవాణా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.